నరసరావుపేటలోని ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలలో సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. వైద్యశాలలో జూనియర్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, కాంపౌండర్లు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. వైద్యశాలలో నిరంతరం శ్రమిస్తూ కోవిడ్ వైద్యం అందిస్తున్నా తమకు నామమాత్రపు వేతనాలు ఇస్తున్నారని అవి కూడా సమయానికి ఇవ్వడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇచ్చే వేతనాలను పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని వైద్యశాల సిబ్బంది డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
Viveka Murder Case: ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచండి: వివేకా కుమార్తె సునీత