రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఐపీసీ కాకుండా జగన్ పీనల్ కోడ్(జేపీసీ) అమలు చేస్తున్నారని విమర్శించారు. అందుకే ఎస్సీలపై అట్రాసిటీ కేసులు, విద్యార్థులపై అత్యాచారం కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
టీఎన్ఎస్ఎఫ్ నేతలకు స్వాగతం
జీవో 77 రద్దు చేయాలనే డిమాండ్‌తో.. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్లి అరెస్టయిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు.. ఇవాళ గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. వారికి నారా లోకేశ్, తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
జీవో వల్ల విద్యార్థులకు ఇబ్బందులు
జీవో నెంబరు 77 వల్ల 3 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తరఫున పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. బోధనా రుసుం, ఉపకార వేతనాల్లో కోత వేసే జీవోను ఉపసంహరించుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: