రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడమంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత సులభం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రికార్డు సమయంలో కంపెనీలు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలన్నా తెదేపా ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 3,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి.. తొలి టైర్ని విడుదల చేసిన అపోలో యాజమాన్యాన్ని లోకేశ్ అభినందించారు. కంపెనీ మరింత వృద్ధిచెంది రాష్ట్ర యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని లోకేశ్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 605 కరోనా కేసులు... 10 మంది మృతి