వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై తప్పుడు కేసులు పెట్టి... బెదిరిస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెద్దపాలెం, శృంగారపురం గ్రామాల్లో పర్యటించిన లోకేశ్... ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించినా... ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా సత్తా చూపాలని లోకేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :