గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో 11 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు.
లోకేష్ పర్యటనకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. విమానాశ్రయంలోనే లోకేష్‌ను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నలుగురు ఏసీపీలు, సుమారు వంద మంది పోలీసు బలగాలను అందుబాటులో ఉంచినట్లు సమాచారం. బుధవారం రాత్రి నుంచే పోలీసులు కసరత్తు చేపట్టగా.. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగానే పోలీసులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు
ఇదీ చదవండి: