ETV Bharat / state

వచ్చేవారం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం బయటపెడతానన్న లోకేశ్​

author img

By

Published : Aug 16, 2022, 10:17 PM IST

NARA LOKESH వైకాపా పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గ పేదల కోసం సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవిని పేరిట ఏర్పాటు చేసిన వైద్య సేవల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

NARA LOKESH
NARA LOKESH

Lokesh fire on CM Jagan: ‘అందరికీ ఆరోగ్యమస్తు - ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య కేంద్రాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్య సంజీవని పేరుతో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, చికిత్స పరికరాలను లోకేశ్‌ సమకూర్చారు. ఇక్కడ దాదాపు 200కు పైగా రోగనిర్ధరణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వి పదో తరగతి పాస్‌.. డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలని లోకేశ్​ ఎద్దేవా చేశారు​. వైకాపా హయాంలో రాష్ట్రానికి వచ్చిన వాటి కంటే బయటకు వెళ్లిన పరిశ్రమలే ఎక్కువని ధ్వజమెత్తారు. పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎంకు వాటా ఎంత అనే చర్చ వస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే.. చర్చకు సిద్ధమని సవాల్​ విసిరారు. ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి సీఎం జగన్‌ దిల్లీలో తలవంచారన్నారు. సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతానని లోకేశ్‌ వెల్లడించారు.

సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం బయటపెడతానన్న లోకేశ్​

ఎస్సీ నేతల నిరాహార దీక్షకు మద్దతు.. విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సీ నేతల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నారా లోకేశ్​ మద్దతు తెలిపారు. సీఎం జగన్‌ దళిత ద్రోహిగా మారారని మండిపడ్డారు. విదేశీవిద్య పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.