క్విట్ ఇండియా ఉద్యమ అమరులకు.. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు వేల మంది విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వివిధ రంగాల ప్రముఖుల్ని సన్మానించారు. ఈ క్రమంలో భారత సైనికాదళంలో హవల్దార్గా పనిచేసిన తాతా పోతురాజుని ప్రత్యేకంగా సత్కరించారు. ఆయనకు శాలువా కప్పిన మంత్రి.. పాదాభివందనం చేశారు. ఈ ఘటనపై పోతురాజు స్పందిస్తూ మంత్రి నుంచి అలాంటి గౌరవం తాను ఊహించలేదని... వారి తండ్రితో తనకు అనుబంధం ఉందని తెలిపారు.
ఇవీ చదవండి