మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరేపల్లిలో శనివారం దొంతిబోయిన దేవేంద్రరెడ్డి, బాలస్వామిరెడ్డి మద్యం తాగారు. అనంతరం డబ్బుల విషయమై వారి మధ్య ఘర్షణ తలెత్తింది. బాలస్వామిరెడ్డి కత్తితో దేవేంద్రరెడ్డిపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతణ్ణి తొలుత గుళ్లపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన చెరుకుపల్లి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో కత్తితో దాడి..ఒకరికి తీవ్ర గాయాలు - murder attempt in guntur
ఇద్దరు వ్యక్తులు కలిసి మద్యం తాగారు. ఆపై వారిద్దరి మద్య డబ్బుల విషయమై వివాదం తలెత్తింది. ఇంకేముంది మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి మరో వ్యక్తి పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.