గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. గుంటూరు హిందూ కళాశాల కూడలి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ కార్మికుల అనుబంధ సంఘాల నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ సమస్యలు పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుంటే అరెస్టులు చేయడం దారుణమని మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: