వేతనాల కోసం ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు నారా లోకేష్ తరఫున పార్టీ నేతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్మికులు నిర్వహిస్తున్న ఆందోళనకు తెదేపా పూర్తి మద్దతు ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.
పార్టీ నేతలు గంజి చిరంజీవి, తెనాలి శ్రావణ్ కుమార్ నిత్యావసర సరుకులను కార్మికులకు అందజేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి, మంత్రులు, సీఆర్డీఏ అధికారుల నివాసాల వద్ద చెత్త వేయాలని కార్మికులకు సూచించారు. కార్మికులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నేతలు తప్పు పట్టారు.
ఇదీ చదవండి: జస్టిస్ రాకేశ్‌కుమార్‌కు అమరావతి రైతుల ఘన వీడ్కోలు