గుంటూరు జిల్లా సత్తెనపల్లి పురపాలక సంఘంలో అధికార పార్టీ నేతలు బలవంతంగా తమతో నామినేషన్లు ఉపసంహరింపజేశారని... తెదేపా, జనసేన పార్టీల అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 25వ వార్డులో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న తనను బెదిరించారని అభ్యర్థి అనురాధ ఫిర్యాదు చేశారు. అధికార వైకాపా నేతలు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి మోసపూరితంగా సంతకాలు చేయించి ఉపసంహరింపజేశారని సత్తెనపల్లి ఆరో వార్డులో తెదేపా తరపున పోటీ చేసిన అభ్యర్థి కోటేశ్వరి ఫిర్యాదు చేశారు. వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు బెదిరింపులకు గురిచేయడం సహా... అక్రమంగా కేసులు బనాయించారని... తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ఎస్ఈసీని కోరారు.
ఇదీ చదవండీ... ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం