ETV Bharat / state

'ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి'

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గుంటూరు పశ్చిమ వైకాపా ఇంఛార్జ్ చంద్రగిరి ఏసురత్నం తన భార్య తరఫుర ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

muncipal election campaign by ycp candidate in guntur
గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో.. పశ్చిమ వైకాపా ఇంఛార్జ్
author img

By

Published : Feb 27, 2021, 4:46 PM IST

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. మిర్చియార్డు మాజీ ఛైర్మన్, గుంటూరు పశ్చిమ వైకాపా ఇంఛార్జ్ చంద్రగిరి ఏసురత్నం... 25వ డివిజన్లో కార్పోరేటర్​గా పోటీ చేస్తున్న తన భార్య కరుణకుమారి తరఫుర ప్రచారం నిర్వహించారు.

వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. డివిజన్ పరిధిలో సమస్యలు గుర్తించామని.. గెలిచిన తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇదే సమయంలో నగరంలోని కొత్తకాలనీకి చెందిన కొందరు ఏసురత్నం సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని.. పార్టీ మళ్లీ తన కుటుంబానికి కార్పోరేటర్​గా అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే... శ్రీరామ రక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.