గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ఉన్న 400 మంది యాచకులకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సీతానగరంలో ఉన్న యాచకులకు భోజనం, ఎయిడ్స్ రోగులకు మందులు అందజేశారు. కరోనా నుంచి తప్పించుకోవాలంటే భౌతిక దూరం, స్వీయ నిర్బంధం ఒక్కటే మార్గమని ఎంపీ సురేష్ వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ స్ఫూర్తితో బాపట్లలోనూ పేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఆకలితో అలమటిస్తున్న వారికి.. అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత