ETV Bharat / state

'వైకాపా కార్యకర్తనే...నన్ను కాపాడండి' - గుంటూరు జిల్లా వార్తలు

జగన్ గారూ మీరే నన్ను కాపాడాలి... బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది... నాపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ... గుంటూరు జిల్లాకు చెందిన పొన్నూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయటం కలకలం రేపింది. దాడి సంబంధించిన సీసీ కెమరా దృశ్యాలు, సెల్ఫీ వీడియోను శ్రీనివాసరావు విడుదల చేశారు. జూన్ నెలలో దాడి జరిగినా పోలీసులు ఇప్పటి వరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవటంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Mp nadigam suresh followers
Mp nadigam suresh followers
author img

By

Published : Oct 31, 2020, 6:02 AM IST

ఎంపీ అనుచరులు దాడి చేశారంటూ బాధితుడి సెల్ఫీ వీడియో

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలేనికి చెందిన పొన్నూరు శ్రీనివాసరావు పెనుమాకకు ఎరువుల కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మందడంలోని ప్రధాన రహదారిపై బైక్​లపై వచ్చిన కొందరు యువకులు ఆయన్ను అడ్డుకున్నారు. శ్రీనివాసరావు వాహనానికి తమ బైకులు అడ్డుగా ఉంచారు. ఆయనపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని దాడి చేసేందుకు యత్నించారు. దాదాపు 10 నిమిషాల పైగా ఈ తతంగం నడిచింది. ఆ తర్వాత శ్రీనివాసరావుని బలవంతంగా బైక్​పై ఎక్కించుకుని వెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఎంపీ అనుచరులతో ప్రాణహాని

బైక్​పై ఎక్కించుకుని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి మరోసారి శ్రీనివాసరావుని తీవ్రంగా కొట్టారు. గాయాల పాలైన శ్రీనివాసరావు ఆ తర్వాత రోజు తుళ్లూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినా తదుపరి చర్యలు లేవు. దీంతో శ్రీనివాసరావు శుక్రవారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనపై దాడి చేసింది ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు కాబట్టే పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. ఎంపీ అనుచరులు లింగాయపాలెంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాననే అనుమానంతో తనపై దాడి చేశారని శ్రీనివాసరావు తెలిపారు. దాడి సమయంలో తన వద్ద ఉన్న చరవాణితో పాటు రూ.10 వేలు లాక్కున్నట్లు వివరించారు. ఎంపీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తనని కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తాను కూడా వైకాపా కార్యకర్తనేనని... పార్టీకి ఓట్లు వేయించానని వీడియోలో చెప్పారు.

ఆధారాలున్నా చర్యల్లేవు

శ్రీనివాసరావుపై దాడి జరిగినట్లు సీసీ టీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోలేదు. నిందితులను ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. ఇటీవల కృష్ణాయపాలెంలో మూడు రాజధానులకు మద్దతుగా వెళ్తున్న వారి వాహనాలు అడ్డుకున్నందుకు 11 మంది రైతులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు పెట్టారు. 24 గంటల్లోపే అరెస్టు చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం, జైలుకు తీసుకెళ్లటం జరిగిపోయాయి. కానీ శ్రీనివాసరావు విషయంలో మాత్రం పోలీసులు ఉదాసీనంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చదవండి : టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.