ETV Bharat / state

రేపల్లే సీహెచ్​సీలో కొవిడ్ కేర్ సెంటర్​ ఏర్పాటుకు చర్యలు: మోపిదేవి

కరోనా కేసులు రాష్ట్రంలో తీవ్రంగా పెరుగుతుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. విధిగా మాస్కులు ధరించాలని కోరారు. గుంటూరు జిల్లా రేపల్లెలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్​సీ)​ను పరిశీలించిన ఆయన.. వైద్య సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్​సీలో కొవిడ్ కేర్ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

mp mopidevi
రేపల్లే సీహెచ్​సీలో కొవిడ్ కేర్ సెంటర్​ ఏర్పాటుకు చర్యలు: మోపిదేవి
author img

By

Published : Apr 26, 2021, 6:32 PM IST

కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా.. గుంటూరు జిల్లా రేపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్​(సీహెచ్​సీ)ను ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. వైద్యశాలలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రేపల్లెలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు

రేపల్లెలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో(సీహెచ్​సీ) కొవిడ్ కేర్ సెంటర్​ను.. ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తీర ప్రాంతంలో కొవిడ్ బారిన పడ్డ బాధితులు.. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్న పరిస్థితి నెలకొందని అన్నారు. కొన్ని సార్లు ఆలస్యం అవ్వడంతో వైద్యం అందక ప్రాణాలు కొల్పుతున్నారని ఆవేదన చెందారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తీర ప్రాంతవాసులకు అందుబాటులో ఉండేలా రేపల్లె సీహెచ్​సీలో కోవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

రెండ్రోజుల్లో అన్ని సౌకర్యాలు సిద్ధం

25 పడకలు, ఆక్సిజన్, మందులు, ఇతర సౌకర్యాలన్నీ రెండ్రోజుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారికి.. ప్రత్యేక క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తామన్నారు.

సీఎం జగన్ సమీక్షలు

రాష్ట్రంలో కరోనా కట్టడికి.. ముఖ్యమంత్రి జగన్ అన్ని చర్యలు తీసుకుంటూ.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. రేపల్లె పట్టణంలో అనధికారికంగా కొవిడ్ చికిత్స చేస్తూ.. ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలుకు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించి జాగ్రత్తలు పాటించాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు.

ఇదీ చదవండి:

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఆడిటింగ్.. చర్యలు చేపట్టిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.