తెరాస, వైకాపాలకు ప్రధాని మోదీ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అమరావతిలో వ్యాఖ్యానించారు. అందరూ కలిసి రాష్ట్రంలో ఓట్లు తొలగింపునకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఏపీలో మొత్తం 54 లక్షల ఓట్లు తొలగించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిన జగన్పై... ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు వల్లే తెరాస గెలిచిందన్నారు.
ఇవీ చదవండి..