తెదేపా నేతలు చినకాకాని జాతీయ రహదారి నిర్బంధానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అందులో భాగంగానే తెదేపా నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇంటి గేట్‌ను తాళ్లతో కట్టి ఆయన్ను బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై గల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగంచటం వలన గృహ నిర్బంధం చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారనీ, నేను ఎక్కడ విఘాతం కలిగించానో చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు. ఇవి అక్రమ నిర్బంధాలు అని అన్నారు. రాష్ట్రంలో ప్రజాసామ్యం ఉందా అని పోలీసులను గల్లా జయదేవ్ నిలదీశారు.
ఎంపీ గల్లా జయదేవ్ కామెంట్స్...
* పోలీసులు మమ్మల్ని అక్రమంగా నిర్బంధించారు
* ఇలా చేయటం చట్ట వ్యతిరేకమని పోలీసులకు తెలుసు.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే మమ్మల్ని నిర్బంధించారు
* రాజధాని గురించి గత ప్రభుత్వంతో భూములిచ్చిన రైతులు ఒప్పందం చేసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తోంది
* రాజధాని గురించి నేను, నారాయణ కేవలం డిజైన్లకు సంబంధించిన సలహాలు మాత్రమే ఇచ్చాం
* శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారమే రాజధాని నిర్ణయం జరిగింది
* జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలు రాకుండానే ముఖ్యమంత్రి ఎలా ప్రకటిస్తారు
* ముఖ్యమంత్రి ప్రకటనతో వాళ్లు అదే విధంగా నివేదిక రాయాల్సి వచ్చింది
* ప్రస్తుతం రాజధాని పోరాటం ప్రజా పోరాటంగా మారింది
* రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీనిపై ఉద్యమిస్తున్నారు
ఇదీ చదవండి: గృహ నిర్బంధంలో తెదేపా నేతలు