కరోనా కట్టడిలో భాగమవుతున్న పాత్రికేయులకు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు నిత్యవసర సరకులను అందజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అయిన పాత్రికేయులు సంపాదన పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఎంపీ అన్నారు. విజ్ఞాన్ విద్యా సంస్థల నుంచి పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఆర్బీఐ ఈఎమ్ఐలు కట్టేందుకు గడువు పెంచినా బ్యాంకుల్లో అవి అమలు కావడం లేదని ఆయన అన్నారు. ప్రజల ఖాతాల నుంచి బ్యాంకు అధికారులు ఈఎమ్ఐలు కట్ చేసుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: