సినీ దర్శకుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్‌ను కలిశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - ఏపీ సభ్యులైన సినీ కళాకారులకు, కార్మికులకు తొలి విడతలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
ఏడాదిగా షూటింగులు ఆగిన కారణంగా 24 క్రాఫ్టులకు చెందిన సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో షూటింగ్‌లకు ప్రభుత్వం, మే 19 నుంచి అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సినీ కార్మికులు కరోనా బారిన పడకుండా, క్షేమంగా ఉండాలంటే... మెుదటి విడతలో సినీ కార్మికులకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: