గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన దీప్తి..భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవతో మనస్తాపం చెందింది. మూడు నెలలుగా కుమారుడితో కలిసి తన తండ్రి ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తన కుమార్తెను కాపురానికి తీసుకువెళ్లాలని దీప్తి తండ్రి దానయ్య..వినుకొండ వెళ్లి అల్లుడు దేవయ్యను కోరారు. దీంతో ఆగ్రహావేశానికి లోనైన దేవయ్య మామ చొక్కా పట్టుకుని దూషించాడు. ఈ విషయమై తన భర్తను ప్రశ్నిస్తానని చెప్పి వినుకొండ వెళ్లిన దీప్తి..ఇంత వరకు ఇంటికి రాలేదని దానయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీప్తి భర్త దేవయ్యపై మామ దానయ్య అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.