ETV Bharat / state

'ఎన్నికల్లో డబ్బు, మద్యంతో దొరికితే కఠిన శిక్షలే'

author img

By

Published : Mar 9, 2020, 12:09 PM IST

స్థానిక, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదని, వైకాపా ప్రజాప్రతినిధులు అందుకు సహకరించాలని గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు అన్నారు.

గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అయోధ్యరామిరెడ్డి కార్యాలయంలో వైకాపా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల గురించి చర్చించారు. మద్యం, నగదు పంపిణీ ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని వైకాపా యోచిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి చెరుకూరి శ్రీరంగనాధరాజు అన్నారు. ఎన్నికలంటే డబ్బు, మద్యం అనేది ప్రజల్లో పాతుకుపోయిందన్నారు. ఆ ఆలోచనను ప్రజల్లో తొలగించే విధంగా అన్ని పార్టీలు ముందుకు రావాలన్నారు. ముందుగా వైకాపా అందుకు నడుం బిగించిందన్నారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. గతంలో ఏ ఖర్చులు లేకుండా ప్రజలకు సేవ చేయాలనే దృక్పధంతో ప్రతిఒక్కరూ రాజకీయాలలో పోటీ చేసేవారు. అదే ఇప్పుడు రాజకీయాలలో పోటీ చేయాలంటే డబ్బున్నవాళ్ళు మాత్రమే పార్టీలకు దిక్కవుతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సామాన్యులు సైతం ఎన్నికల్లో పోటీ చేసే రోజులు రావాలనేదే వైకాపా ధ్యేయమన్నారు. సీఎం జగన్ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ నిషేధ చట్టాన్ని తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. డబ్బు, మద్యం పంచుతూ ఏ పార్టీ వాళ్లు దొరికినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవచ్చని మంత్రి చెరుకూరి శ్రీరంగనాధరాజు తెలిపారు. తెలుగుదేశం వారిని కట్టడి చేయడం కోసమే ఈ నిబంధనలు అనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపాతో వైకాపాకు పోటీ ఉండకపోవచ్చన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, నంబూరి శంకర్రావు,రజని, బొల్లా బ్రహ్మనాయుడులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

'విశాఖ పీఠాన్ని దక్కించుకోవాలి.. ఓడితే మంత్రులదే బాధ్యత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.