ETV Bharat / state

చిలకలూరిపేటలో కొవిడ్​ కేర్​ సెంటర్​ను సందర్శించిన ఎమ్మెల్యే రజని - mla rajani visits covid care center news

గుంటూరు జిల్లా చిలకలూరిపేట టిడ్కో గృహ సముదాయంలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్​ను ఎమ్మెల్యే విడదల రజిని సందర్శించారు. నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, డీఎస్పీ విజయ భాస్కర్​లతో కలిసి అక్కడ వసతులను పరిశీలించారు. వైద్య సదుపాయాలు, అందిస్తున్న చికిత్స గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు.

covid care center
కొవిడ్​ కేర్​ సెంటర్​ను సందర్శించిన ఎమ్మెల్యే
author img

By

Published : May 11, 2021, 4:24 PM IST

కొవిడ్ కేర్ సెంటర్​లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. స‌బ్‌క‌లెక్ట‌ర్ శ్రీవాస్ నుపూర్ అజ‌య్‌కుమార్‌, డీఎస్పీ విజ‌య‌భాస్క‌ర్​ల‌తో కలిసి పట్టణంలోని టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన కరోనా చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. కొవిడ్​ బాధితులకు సకాలంలో వైద్యం అందేందుకు.. ప్రతి ఆస్పత్రితో పాటు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కేంద్రాల‌కు కూడా నోడ‌ల్ అధికారుల‌ను ప్రభుత్వం నియ‌మించింద‌ని చెప్పారు.

చిల‌క‌లూరిపేట‌లోని ప్ర‌భుత్వ, ప్రైవేటు వైద్య‌శాల‌ల‌కు ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా చేసేందుకు నోడ‌ల్ అధికారుల‌తో చర్చించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రెమిడెసివ‌ర్ ఇంజక్ష‌న్ల కొర‌త రాకుండా ఉండేలా డ్ర‌గ్ ఇన్​స్పెక్టర్లతో మాట్లాడినట్లు తెలిపారు. క‌రోనా రోగుల‌కు ఇబ్బందులు రాకుండా చూడాల‌ని.. అన్నీ ఆస్ప‌త్రుల నోడ‌ల్ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్​లో కావాల్సిన వైద్య సామగ్రిని తెప్పించటంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు.

సిలిండర్లు సేకరించండి:

చిల‌క‌లూరిపేట ప‌రిధిలో వాణ‌ిజ్య‌ప‌రంగా వాడుతున్న సిలిండ‌ర్లను సేక‌రించాల‌ని అధికారులకు ఎమ్మెల్యే చెప్పారు. ఆయా సిలిండ‌ర్ల‌ను ఆస్ప‌త్రుల‌కు తాత్కాలికంగా అంద‌జేయాల‌ని తెలిపారు. వాటిని రోగుల‌కు ఆక్సిజ‌న్ అందించేందుకు వినియోగించేలా చూడాల‌ని కోరారు. సిలిండ‌ర్ల సేక‌ర‌ణ బాధ్య‌తను స‌బ్‌క‌లెక్ట‌ర్‌కు అప్పగించారు. టిడ్కో కొవిడ్ కేర్ సెంట‌ర్‌లో ప్ర‌స్తుతం 225 బెడ్లు ఉన్నాయ‌ని.. వీటి సంఖ్య‌ను 400కు పెంచాల‌ని ఆదేశించారు. క‌నీసం 50 ఆక్సిజ‌న్ బెడ్లు ఉండేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. క‌రోనా నిర్థర‌ణ ప‌రీక్ష‌ల కోసం ప్ర‌త్యేకంగా కిట్లు తెప్పించాల‌న్నారు. రోగుల‌కు మంచి ఆహారాన్ని అందించాల‌ని సూచించారు. పురపాలక చైర్మన్ షేక్ రఫాని, ఇతర శాఖల అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

ఇదీ చదవండి:

కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలి: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.