గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ జీవోను రద్దు చేయాలని కోరుతూ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. రాజధాని నిర్మాణాలకు మంగళగిరే సరైనదని పేర్కొన్నారు. నోటిఫికేషన్ కారణంగా రైతులు ఆయా భూముల వినియోగంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. అప్పట్లో రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు బలవంతంగా భూములు తీసుకున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి..