1000 రూపాయలు దాటిన హాస్పిటల్ బిల్లును.., సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అర్హత ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలకు కుల, మత భేదాలు, పార్టీలకు అతీతంగా పంపిణీ చేస్తున్నట్లు వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఆరోగ్యశ్రీ వర్తించేటట్లు సీఎం జగన్మోహన్రెడ్డి చేశారని కొనియాడారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నిమ్స్ 24 కొవిడ్ ఆసుపత్రి అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇదీ చదవండి: హఠాత్తుగా ఆపద.. కొవిడ్ రోగుల హఠాన్మరణం