ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆగ్రహం గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై.. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి అభివృద్ధిపై నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిలో.. సానిటైజర్ సిబ్బంది నుంచి సూపరింటెండెంట్ వరకు పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా.. తీరు మారడం లేదని మండిపడ్డారు.ముఖ్యమంత్రి జగన్ పేదల వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుంటే.. వైద్య సిబ్బంది, అధికారులు తమ చర్యలతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమిటీ సమావేశాల్లో నిర్ణయించిన ఒక్క అంశాన్ని కూడా ఆచరణలో పెట్టటం లేదన్నారు. వైద్యుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
Ex MP Harsha Kumar: ఆ ఎస్సైని వెంటనే డిస్మిస్ చేయాలి: హర్ష కుమార్