సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాదయాత్ర చేపట్టారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న అందరికీ... కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో తెనాలిలో స్థలం కూడా కొనకుండా ప్రజలకు ఇళ్లు ఇస్తామని చెప్పి డీడీలు వసూలు చేసి మోసం చేశారని శివకుమార్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డీడీలు తిరిగి ప్రజలకు ఇచ్చామని గుర్తు చేశారు. వాస్తవాలు తెలిస్తే తెదేపా కార్యాలయంపై లబ్ధిదారులు దాడి చేస్తారని హెచ్చరించారు. తెదేపా పరిపాలనలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం అసమర్థత కాదా అని ప్రశ్నించారు. సంక్రాంతికి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామన్న తెదేపా నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ... అసంపూర్తిగా ఉన్న పనులు కూడా వారే పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన అవినీతి బయటకు తీస్తామన్నారు.
ఇదీ చదవండి: