ETV Bharat / state

'త్వరలో మిర్చి యార్డుల్లో కార్యకలాపాలు ప్రారంభం'

లాక్​డౌన్ కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన మిర్చి పంట.. కోటి బస్తాలకు పైగా గోదాముల్లో నిలిచిపోయింది. మిర్చి యార్డులో కార్యకలాపాలను అతి త్వరలో ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రధ్యుమ్న తెలిపారు.

mirchi yard in guntur
mirchi yard in guntur
author img

By

Published : May 18, 2020, 8:50 PM IST

గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా 50 రోజులకు పైగా మిర్చి యార్డులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన మిర్చి పంట.. కోటి బస్తాలకు పైగా శీతల గోదాముల్లో నిలిచిపోయింది. ఈ విషయంపై ఈటీవి-ఈనాడులో వచ్చిన కథనాలతో మార్కెటింగ్ శాఖ అప్రమత్తమైంది. మిర్చియార్డు తిరిగి తెరవటంపై అధికారులు, వ్యాపారులు, కూలీలతో కమిషనర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 4వ విడత లాక్ డౌన్ లో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో యార్డులో క్రయవిక్రయాల ప్రారంభానికి సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

కోయంబేడు మార్కెట్ ద్వారా రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కరోనా కేసులు రావటంతో జిల్లాలో ఏం చేయాలని అధికారులు సమాలోచనలు జరిపారు. పూర్తి జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు మిర్చి అమ్మకాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై సమావేశంలో చర్చించారు. వ్యాపారులు, ఏంజెట్లను రెండుగా విభజించి రోజు మార్చి రోజు కొనుగోళ్లు జరిపేలా చూడాలనే ప్రతిపాదన వచ్చింది. దాని ద్వారా యార్డులో ఉండేవారి సంఖ్య సగానికి సగం తగ్గుతుంది. అలాగే వ్యాపార లావాదేవీల్ని వికేంద్రీకరించటం రెండో ప్రతిపాదన.

జిల్లాలోని సత్తెనపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల మార్కెట్ల నుంచి కార్యకలాపాలు జరిపేలా చూడటం వల్ల గుంటూరు మార్కెట్ కు రైతులు ఎక్కువ మంది రావాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రస్తుతం మిర్చిపంట చాలా వరకు శీతల గిడ్డంగుల్లో ఉన్న దృష్ట్యా... అక్కడి నుంచే నేరుగా కొనుగోళ్లు చేయటం ద్వారా యార్డుపై ఒత్తిడి తగ్గించవచ్చని భావిస్తున్నారు. అయితే యార్డు ప్రారంభంపై ఇంకా నిర్ణయానికి రాలేదని.. ముఖ్యమంత్రి, మంత్రితో చర్చించిన తర్వాత అధికారికంగా తేది ప్రకటిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రధ్యుమ్న తెలిపారు. యార్డులోకి వచ్చేవారిని తగిన పరీక్షలు నిర్వహించేలా వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: మాంద్యం భయాలతో పతనం- సెన్సెక్స్​ 1068 మైనస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.