ETV Bharat / state

Troubles Of Chilli Farmers: అకాల వర్షాలతో అల్లాడుతున్న అన్నదాతలు - అకాల వర్షాలతో అన్నదాతలకు కష్టాలు

Mirchi Crop Damage Due To Heavy Rain: ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిపంట అకాల వర్షాలకు తడిసిపోవటంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతులు అల్లాడుతున్నారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మిర్చి రైతులు వేడుకుంటున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 5, 2023, 3:48 PM IST

అకాల వర్షాలతో అల్లాడుతున్న అన్నదాతలు

MIRCHI FARMERS LOSSES DUE TO RAIN: అకాల వర్షాలతో మిర్చి రైతులు దెబ్బతిన్నారు. అనుకోని వర్షాలు శరాఘాతంలా మారాయి. పంట బాగా పండి చేతికొచ్చే సమయానికి వర్షాలు కురవడంతో మిర్చి రైతులు నష్టపోయారు. ఎరుపు కాయ కాస్త తాలుకాయగా మారడంతో వ్యాపారులు పంటను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిపంట అకాల వర్షాలకు తడిసిపోవటంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతన్నలు అల్లాడుతున్నారు. కోతలు పూర్తయి ఆరబెట్టుకుంటున్న వేళ వర్షాల జోరుతో రైతుల పరిస్థితి తలకిందులైంది. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు కష్టించినట్లే ఇప్పుడు వర్షం నుంచి మిరపకాయల్ని కాపాడుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. అకాల వర్షాలతో మిర్చి రైతులు రెండు విధాలా నష్టపోయారు.

ఓవైపు పొలాల్లోని మిర్చి వర్షాలకు దెబ్బతినగా, మరోవైపు కోత పూర్తై కల్ల్లాల్లో ఆరబెట్టిన మిర్చి సైతం తడిసిపోయింది. పట్టలు కప్పినప్పటికీ చాలా వరకు మిర్చి బస్తాలు తడిశాయి. మిర్చి తేమగా ఉండటంతో దాన్ని ఆరబెడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మిర్చి బూజు పట్టి కొన్నిచోట్ల కుళ్లిపోతున్నాయి. ఎక్కువ శాతం మిర్చి పంట తాలు కాయలుగా మారిపోతున్నాయి. కనీసం ఎకరానికి 5, 6 క్వింటాళ్ల వరకు తాలు కాయలుగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిర్చి తడవటంతో ధర పడిపోయే ప్రమాదం ఏర్పడింది. గతంలో క్వింటా 20 వేల వరకు ధర పలకగా ఇప్పుడు 15 వేలకు పడిపోయింది. తాలుకాయలు గతంలో 10వేల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు 5 వేల రూపాయలకు పడిపోయింది. పంటపొలాల్లో ఉన్న మిర్చి కూడా వర్షం కారణంగా పాడైపోతోంది. కాయలకు మచ్చ పడితే ధర సగానికి పైగా పడిపోతుంది. ఇపుడు తడిసిన మిర్చిని కొనేందుకు ఎవరూ ముందుకు రారని తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

వర్షాలకు ప్రధానంగా కౌలు రైతులు దెబ్బతిన్నారు. ఎకరాకు 20 వేల రూపాయలు కౌలుకు తీసుకున్న రైతులు అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటను కాపాడుకోవడం కౌలు రైతులకు శక్తికి మించిన పనిగా మారిపోయింది. ఈ ఏడాది మిర్చి పంటలో ఆశించిన ఫలితాలు వస్తాయన్న కౌలు రైతుల ఆశలు ఆవిరైపోయాయి.

"వర్షం పడిన తరువాత ఎకరానికి 50 వేల రూపాయలు నష్టం. వర్షం పడి మిర్చి తాలుకాయలు అయ్యాయి. మిగిలిన మిర్చి కూడా తాలుకాయలు అవుతాయి. మిరపకాయలపై కప్పడానికి పట్టలు లేవు. టీడీపీ ప్రభుత్వం పట్టలు, ఇంజన్​లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఓ పట్ట లేదు. ఇంజన్ లేదు."- శ్రీనివాసరావు, మిర్చి రైతు

అకాల వర్షాల వల్ల మిర్చి పూర్తి స్థాయిలో దెబ్బతింది. పట్టలు సకాలంలో అందకపోవడం వలన మేము దెబ్బతిన్నాము. కోయాల్సిన పంట కూడా దెబ్బతింది. రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు."- హరికృష్ణ, మిర్చి రైతు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.