ఆరుగాలం శ్రమించి.. చెమట ధారపోసి పండించిన మిర్చి పంటకు.. మంచి ధర కోసం వేచి చూస్తున్న రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ నిరాశను మిగిల్చింది. అప్పులు చేసి పంటలు పండించిన రైతన్నకు కన్నీరే మిగిలింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద "శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ లో పరిసర గ్రామాల రైతులు తమ పొలాల్లో పండించిన లక్ష క్వింటాల మిరపకాయలను నిల్వ ఉంచారు. ఆ కోల్డ్ స్టోరేజ్ లో గత రెండు వారాలుగా ఏసీలు పని చేయడం లేదు. ఫలితంగా.. సుమారు 20 వేల క్విటాల మిరపకాయలు దుమ్ము పట్టి పాడైపోయాయి.
సమాచారం తెలుసుకున్న రైతులు గత మూడు రోజుల నుంచి స్టోరేజ్ లో మిర్చీ టిక్కీలు బయటకు తీసుకువచ్చి ఆరబెట్టుకుంటున్నారు. ఇంత జరిగినా.. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు మాత్రం స్పందిచడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బాధ్యత లేకుండా యాజమాన్యం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: