గుంటూరు జిల్లా వినుకొండలో బాలికపై అత్యాచారం జరిగింది. మాధవరపు గోపి(35) అనే వ్యక్తి తన కుమార్తెను అత్యాచారం చేసినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లి దీనికి సహకరించినట్లు పేర్కొన్నాడు. బాలిక తల్లి ఉద్దేశపూర్వకంగా గదిలోకి నెట్టిందని తండ్రి ఆరోపించాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజ్యలక్ష్మి వెల్లడించారు. వారిని విచారించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై అన్నారు.
ఇదీ చదవండి: నరసారావుపేటలో జేఎన్టీయూ భవనాలకు సీఎం శంకుస్థాపన