ETV Bharat / state

'రైతాంగానికి తోడుగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు'

భారతీయ వరి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్​ కులాల ఉప ప్రణాళిక పథకం కింద దళిత రైతులకు విత్తనాలు అందించారు. గుంటూరు జిల్లా రేపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. అధిక దిగుబడులు వచ్చే విత్తనాలను రైతులకు అందించేలా కృషి చేయాలని మంత్రి శాస్త్రవేత్తలను కోరారు.

రైతులకు విత్తనాలు అందిస్తున్న మంత్రి మోపిదేవి

author img

By

Published : Jun 27, 2020, 3:17 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ పర్యటించారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక పథకం కింద భారతీయ వరి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో దళిత రైతులకు ఆయన విత్తనాలు పంపిణీ చేశారు. రేపల్లె మండలంలోని నల్లూరు, చోడయపాలెం గ్రామాల్లోని 120 మంది ఎస్సీ రైతులకు.. ఒక్కొక్కరికి 25 కిలోల వరి విత్తనాలు మంత్రి అందజేశారు. దళిత రైతాంగానికి సాయం చేసేందుకు భారతీయ వరి పరిశోధన సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ఉచితంగా రైతులకు విత్తనాలు అందజేయడం అభినందనీయమని మోపిదేవి అన్నారు.

చిన్న, సన్నకారు రైతులందరికీ అధిక దిగుబడి వచ్చే విత్తనాలు అందించాలని, ఆ దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. రైతాంగానికి ఎల్లప్పుడు తోడుగా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని...రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నాగార్జున పాల్గొన్నారు.

ఇదీ చదవండి : విజయసాయిరెడ్డి...ఇలాంటి ప్రయత్నాలు మానుకో:రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.