మునుపెన్నడూ లేని విధంగా మహిళలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో స్త్రీ శక్తి సమాఖ్య కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా...పేదలకు నిత్యావసరాలతో పాటు వెయ్యి రూపాయల నగదును అందిస్తున్నామన్నారు. అనంతరం ఆముదాలపల్లి పంచాయతీలోని 1300 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ జెండా ఊపి మోపిదేవి ప్రారంభించారు. కరోనాపై పోరుకోసం లక్షా 58 వేల రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్‌కి నిజాంపట్నం మండల డ్వాక్రా సంఘాల మహిళలు మంత్రికి అందకేశారు.
ఇదీచదవండి