రాష్ట్రంలో ఉల్లి కొరతపై మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఉల్లిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నామని చెప్పారు. రైతు బజార్లలో రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు బజార్లలో రెండ్రోజుల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసే గిడ్డంగులపై దాడులు చేపడుతామన్న మోపిదేవి... ప్రజలకు నాణ్యమైన ఉల్లి సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు చంద్రబాబు