ఆంధ్రప్రదేశ్ రాజధానిని తరలించే కుట్ర వైకాపా మేనిఫెస్టోతో బయటపడిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ప్రయివేటు అపార్ట్మెంట్లకు దీటుగా చంద్రన్న ఇళ్లు నిర్మిస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
మంగళగిరిలో ఒక్క ఇటుక కూడా కదిలించేది లేదు
మంగళగిరిలో ఇళ్లు, దుకాణాలు తొలగిస్తారని వైకాపా ఆరోపిస్తోందని... ఒక్క ఇటుక కూడా కదిలించేది లేదని, పట్టాల సమస్య కూడా పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని అమరావతి పేరు కూడా లేదని, రాజధానిని మరో చోటుకు తరలించాలన్న కుట్ర వైకాపా మేనిఫెస్టోలో బయటపడిందని విమర్శించారు.
జగన్‌కు ఓటువేస్తే మోదీకి వేసినట్లే...
గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి లోకేశ్‌తో పాటు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని జగన్.. కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్‌కి ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.