ETV Bharat / state

హైకోర్టు తీర్పు ముందే ఊహించాం.. అనుమతిస్తే పాదయాత్ర చేసుకోండి: మంత్రి బొత్స - అమరావతి రైతుల పాదయాత్ర

Minister Botsa Comments On High Court Judgement : పాదయాత్రపై హైకోర్టులో వచ్చిన తీర్పును ముందే ఊహించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. న్యాయస్థానం అనుమతి ఇస్తే పాదయాత్ర చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Minister Botsa Comments
Minister Botsa Comments
author img

By

Published : Nov 1, 2022, 7:21 PM IST

MINISTER BOTSA ON HIGH COURT JUDGEMNET: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో వచ్చిన తీర్పు ఊహించిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. న్యాయస్థానం అనుమతి ఇస్తే పాదయాత్ర చేసుకోవచ్చని.. అందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్ర అని విమర్శించారు. జనవాణి 26 జిల్లాల్లో కాకపోతే.. ఒడిశా ఇతర రాష్ట్రాల్లో కలిపి 56 జిల్లాలో చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కాపు నేతల సమావేశం విజయవాడలో మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు. తెదేపా సైతం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవచ్చని.. తప్పులేదన్నారు.

హైకోర్టు తీర్పును ముందే ఊహించాం.. అనుమతి ఇస్తే పాదయాత్ర చేసుకోండి

ప్రతిదీ ప్రజలనడిగి చేయలేము: తమ ప్రభుత్వ విధానాలు బాగోపోతే తామే ఎన్నికల్లో నష్టపోతామని.. ప్రతిదీ ప్రజలను అడిగి చేయలేమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అర్ధరాత్రి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజల్ని అడిగే చేశారా అని ప్రశ్నించారు. 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలన్న మోదీ.. పార్లమెంట్​లో ఎందుకు చట్టం చేయట్లేదని నిలదీశారు. నాడు-నేడు ఓ అద్భుత కార్యక్రమమేమీ కాదన్న మంత్రి.. పాఠశాలల పరిస్థితి గతంలో ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందని చెప్పే ప్రయత్నం మాత్రమే అని తెలిపారు.

గత 3-4ఏళ్ల కిందట రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులు, నేటి పరిస్థితులు ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలన్నారు. 2014 నాటికి ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య 42లక్షలు ఉంటే, 2019నాటికి అది 37లక్షలకు పడిపోయిందని గుర్తు చేశారు. గత 3ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్యను పూర్వస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 2900 పాఠశాలలు మూతపడ్డాయని.. వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కటీ మూతపడలేదని స్పష్టం చేశారు. మీడియాలో వచ్చే కథనాలపై స్పందించిన మంత్రి.. తమ తప్పులు సరిదిద్దుకుని మరింత బలపడతామని చెప్పారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.