Kondaveedu Fort: గుంటూరు జిల్లాలోని కొండవీడును ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొండవీటు కోటపై రూ.13.5 కోట్లతో నగరవనం అభివృద్ధి పనులకు.. స్థానిక ఎమ్మెల్యే విడదల రజినితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కోట అభివృద్ధికి నాంది పలికారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాకే కాకుండా ప్రపంచస్థాయిలో కొండవీడును అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు.
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు: మంత్రి బాలినేని
minister balineni slams chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని మంత్రి బాలినేని విమర్శించారు. చెప్పిన మాటపై ఆయన ఉండరని.. మధ్యలోనే వదిలేయడం చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. ఎవరూ ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించలేరని వ్యాఖ్యానించారు. ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా విషయంపై స్పందిస్తూ.. ఆయన మతిస్థిమితం లేని వ్యక్తి అన్నారు. ఆయన మాటలను పట్టించుకోకూడదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి