మెడికల్ కళాశాల నిర్మాణం కోసం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి పరిసర ప్రాంతాల్లో స్థలాలను ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డితో కలిసి 2,3 స్థలాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైద్య కళాశాల నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. తాను చూసిన స్థలాలు సంతృప్తికరంగా లేవని.. మరికొన్ని భూములు చూసి 10 రోజుల్లో మంచి స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి... 1,400 పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: సీఎం