వైకాపా ఎమ్మెల్యేలే పంట ఉత్పత్తుల కొనుగోలులో దళారులుగా మారి, రైతుల నోట్లో మట్టి కొట్టారని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రైతులకు ఈ ప్రభుత్వం ఎంత ఖర్చుచేసిందనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, రైతుల పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తే..., జగన్ ఎందుకు అమలుచేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను నిలిపేస్తున్నారా అని ఆలపాటి నిలదీశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే నెపంతో ఎంత దోచుకోవాలనుకుంటున్నారని రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: భవిష్యత్తులో వ్యవసాయం బంగారమయం: నాబార్డ్ ఛైర్మన్