ETV Bharat / state

సీఎం సారూ.. పంట మద్దతు ధర ఏదీ..? - Telugu latest news

Minimum Support Price of Crops: మద్దతు ధరలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో నిర్ణయించిన ధరల్నే ఇప్పటికీ వల్లెవేస్తోంది. కేంద్రం మద్దతు ధరలను ఏటా ఎంతో కొంత పెంచుతున్నా.. రాష్ట్రం మాత్రం అలా పెంచాలన్న ఊసే మరచింది. ఖరీఫ్‌లో విత్తనం వేయడానికి ముందే ఏటా మద్దతు ధరల్ని ప్రకటించి అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. తర్వాత పెంపు విషయాన్ని విస్మరించారు. ఎరువులు, విత్తనాలు, సాగుఖర్చులు పెరిగినా.. అందుకు అనుగుణంగా మద్దతుధరల్లో పెరుగుదల లేదు.

Minimum Support Price of Crops
పంటల మద్దతు ధర
author img

By

Published : Nov 18, 2022, 12:24 PM IST

Where Is Minimum Support Price: కేంద్రం ఖరీఫ్‌, రబీల్లో కలిపి 24 పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. ఆ జాబితాలో లేని పంటలకు తామే మద్దతు ధర ప్రకటించి కొంటామని ఎన్నికల్లో వైకాపా హామీ ఇచ్చింది. 2019-20 పంటకాలానికి సంబంధించి 2020 జనవరిలో కొన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. జాతీయ స్థాయిలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ ఏటా మద్దతు ధరలను కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా... వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ కు మద్దతు ధరల్ని సిఫార్సు చేస్తుంది. 2022-23 సంవత్సరంలో ధాన్యానికి 2,933 రూపాయలు, జొన్నకు 3,334, రాగులుకు 4,252, పెసరకు 9,756, నువ్వులకు 10,013, పత్తికి 8,551 చొప్పున ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే... తాము ప్రకటించే పంటలకు అదే తీరులో పెంచాలనే విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరచింది.

మద్దతు ధరలు పెంచకపోగా.. తాము ప్రకటించిన ధరలకైనా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా అంటే.. అదీ లేదు. 2019-20లో 972 టన్నుల ఉల్లి, 12వేల టన్నుల అరటి, 3,600 టన్నుల బత్తాయి, 1,425 టన్నుల టమాటానే కొనుగోలు చేసింది. రెండేళ్లుగా సేకరించిన దాఖలాలే లేవు. అరటికి కిలోకు 8 రూపాయలు ప్రకటించినా కొవిడ్‌ సమయంలో కిలో 4 చొప్పునే కొనడం మద్దతు ధరల అమలు తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 66వేల కోట్ల జీవీఏ అందించే ఆక్వారంగం విషయంలోనూ ప్రభుత్వం మద్దతు ధరల్ని అమలు చేయట్లేదు. వంద కౌంటు రొయ్యకు ఉత్పత్తి వ్యయానికి తగినట్లుగా నిర్ణయించలేదు. కిలోకు 30 రూపాయలు తగ్గించి 240 చొప్పున నిర్ణయించి తర్వాత 210కి కుదించింది. అదీ అమలు కావట్లేదు..

రైతుకు సాగు ఖర్చులు ఏటికేడు పెరుగుతున్నాయి. ఎరువులు, పురుగుమందులు, పెట్రోలు, డీజిల్‌తో పాటు యంత్ర పరికరాల ధరల పెరుగుదలతో సేద్య ఖర్చులూ దాదాపుగా రెట్టింపయ్యాయి. మూడేళ్ల క్రితం వరికి 30వేల పెట్టుబడి అవుతుంటే.. ఇప్పుడు 43 వేలకు చేరింది. వేరుసెనగకూ ఎకరానికి 35వేల వరకూ ఖర్చవుతోంది. చిరుధాన్యాల సాగుకు ఎకరానికి 20వేల వరకు పెట్టుబడి పెట్టక తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దిగుబడులు పడిపోతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పంటల పెట్టుబడుల్ని పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరల్ని నిర్ణయించాల్సి ఉన్నా.. రాష్ట్రం మూడేళ్ల నాటి ధరలనే కొనసాగిస్తుండటంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మద్దతు ధరలు లేక.. టమాటా, మామిడి, నిమ్మ రైతులు నష్టాల్లో మునుగుతున్నారు. రాష్ట్రంలో ధర దక్కక రోడ్లపై పారబోస్తుంటే... కేరళలో కూరగాయ పంటలనూ మద్దతు ధరలకు కొంటున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌, సీతాఫలం, జామ తదితర తోటల సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నందువల్ల వాటికీ మద్దతు ధరలను నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. ఆర్‌బీకేల ద్వారా పంటలను కొంటామని ప్రభుత్వం చెబుతున్నా.. ఎవరు కొంటారనే ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్రేంలో కొనుగోలుకు ప్రత్యేక వ్యవస్థ లేకపోగా వ్యవసాయ మిషన్‌ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా పెట్టుబడి ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచడంతోపాటు కూరగాయ, ఇతర పండ్ల రకాలకూ మద్దతు ధరలను నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు.

కేంద్రం మద్దతు ధరలను ఏటా ఎంతో కొంత పెంచుతున్నా.. రాష్ట్రం మాత్రం వాటి ఊసే మరచింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.