farmers' concern on power cuts: రాత్రి సమయంలో తరచూ విద్యుత్తు కోత విధిస్తున్నారని గుంటూరు జిల్లా బుద్దాం గ్రామానికి చెందిన ఆక్వా రైతులు ఆగ్రహించారు. అర్ధరాత్రి సమయంలో ఎప్పుడు సరఫరా నిలిచిపోతోందో తెలియడం లేదని.. ఏరేటర్లు పనిచేయక ఆక్సిజన్ సరఫరా తగ్గి రొయ్య పిల్లలు చనిపోతున్నాయని మంగళవారం అర్ధరాత్రి కర్లపాలెంలోని విద్యుత్తు కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు.
అప్రకటిత కోతలపై సిబ్బందిని నిలదీశారు. జనరేటర్లు నడపటానికి డీజిల్ కొనలేకపోతున్నామని.. రానున్న రోజుల్లో కోతలు పెరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: ELECTRICITY CHARGES : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఏప్రిల్ నుంచే అమల్లోకి..