ఆ గ్రామంలో వారంతా దశాబ్దాలుగా రహదారి నిర్మాణ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారి నైపుణ్యాన్ని గుర్తించిన గత ప్రభుత్వం రోడ్డు నిర్మాణ యంత్రాలు, వాహనాలను రాయితీపై అందజేసింది. దీంతో కూలీలు కాస్తా యజమానులయ్యారు. అమరావతి నిర్మాణ సమయంలో సగం యంత్రాలు ఆ గ్రామస్థులవే నడిచేవి. కానీ ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ఆగిపోవటంతో.. ఇతర రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్లారు. అంతలోనే కరోనా మహమ్మారి వారి పొట్ట కొట్టింది. లాక్‌డౌన్‌తో పనులు నిలిచిపోవడంతో.. ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న యంత్రాలకు ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పులు ఓవైపు.. కరోనా మరోవైపు చుట్టుముట్టిన వేళ గుంటూరు జిల్లా మేరికపూడి గ్రామస్థుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఇదీ చదవండి:తెనాలి హత్య కేసు నిందితుల అరెస్ట్ ..