ETV Bharat / state

భార్య చెప్పిన మాట వినలేదని.. భర్త - husband suicide news

భార్య తన మాట వినలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

men suicide in tenali
men suicide in tenali
author img

By

Published : Aug 27, 2021, 3:23 AM IST

Updated : Aug 27, 2021, 6:51 AM IST

గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ద్వారకా నగర్ లో దిలీప్ కుమార్ (25) అనే వ్యక్తి తన భార్య వివాహ వేడుకలకి వెళ్లి తాము చెప్పిన సమయానికి తిరిగి రాలేదని మనస్థాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇతడికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. దిలీప్ కుమార్ భార్య గుంటూరులోని బంధువుల వివాహానికి వెళ్లింది. వివాహం అయిన వెంటనే ఇంటికి తిరిగి రావాలని దిలీప్ కుమార్ తన భార్యకు చెప్పాడు. పెళ్లి అయ్యి మరుసటిరోజు కూడా మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేయడం కోసం ఆమె గుంటూరులోనే ఉంది. దీంతో మనస్థాపానికి గురైన దిలీప్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గుర్తించిన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: LIVE VIDEO: విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి

Last Updated : Aug 27, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.