రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా కారంపూడి వద్ద శనివారం జరిగింది. సన్నగండ్ల గ్రామ శివారులో మాచర్ల నరసరావుపేట ప్రధాన రహదారి పక్కన పేటసన్నిగండ్లకు చెందిన నెలకుర్తి సీతయ్య పశువులను మేపుతున్నాడు.
ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం అతణ్ని ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని కారంపూడి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: