కార్పొరేట్ విద్య ప్రక్షాళనపై.. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో ప్రముఖ విద్యావేత్తలు సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత, ప్రతి విద్యార్థికి విద్య చేరువవ్వాలంటే తీసుకోవాల్సిన చర్యలు, పథకాలపై.. ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ కె.హేమచంద్రరెడ్డి వివరించారు. ర్యాంకులపైనే విద్యార్థులకు శ్రద్ధ పెంచడం కాకుండా.. వారిలో ఉన్న ప్రతిభను గుర్తించేలా.. చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి ర్యాంకులు రావాలని.. ఇంజినీర్లు, డాక్టర్లు అవ్వాలనే తపనతో కార్పొరేట్ మోసాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయన్నారు.
ఇదీ చూడండి: