ETV Bharat / state

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వైద్య పరీక్షలు

author img

By

Published : Aug 11, 2020, 10:37 PM IST

భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజుకు ప్రముఖ జాయింట్ రీప్లేస్​మెంట్ సర్జన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కుడి మోకీలు నొప్పితో బాధపడుతున్న సోము వీర్రాజు గుంటూరులోని సాయి భాస్కర్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేశారు.

Medical examination for BJP state president Somu Weeraraj
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వైద్య పరీక్షలు

భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజుకు ప్రముఖ జాయింట్ రీప్లేస్​మెంట్​ సర్జన్, ఆరోగ్యశ్రీ నెట్​వర్క్​ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి వైద్య సేవలు అందించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంగళవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సోము వీర్రాజు సందర్శించారు. అనంతరం కుడి మోకీలు నొప్పితో బాధపడుతున్న సోము వీర్రాజు గుంటూరులోని సాయి భాస్కర్ హాస్పిటల్​కు వచ్చి డాక్టర్ నరేందర్ రెడ్డిని కలిసి మోకీలు పరిస్థితిని వివరించారు.

ప్రస్తుతానికి శస్త్రచికిత్స ఏమీ అవసరం లేదని చిన్నపాటి వ్యాయామాలు, ఓ టాబ్లెట్​తో నొప్పిని నివారించవచ్చని సూచించారు. ఏ చిన్న అవసరం వచ్చినా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజును డాక్టర్ నరేందర్ రెడ్డి, బీఎన్ఆర్ గ్రూప్ ఛైర్మన్, టెక్స్​టైల్​ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు

ఇదీ చదవండి: 24 గంటల వ్యవధిలో 9,024 కరోనా కేసులు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.