ETV Bharat / state

పోలీసుల ఎదుట మంగళగిరి హత్యకేసు నిందితులు - surrendering to police

గత రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేత ఉమాయాదవ్​ను దారుణంగా  హత్య చేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వర్గపోరు, భూవివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది.

మంగళగిరి హత్యకేసు నిందితులు
author img

By

Published : Jun 26, 2019, 1:53 PM IST

Updated : Jun 26, 2019, 3:44 PM IST

మంగళగిరి హత్యకేసు నిందితులు

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేత ఉమాయాదవ్​ను దారుణంగా హత్యచేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మెుత్తం ఏడుగురు నిందితులు హత్యలో పాల్గొన్నట్లు డీఎస్పీ రామృకృష్ణ స్పష్టం చేశారు. కాగా...తోట శ్రీను, సైదులు, పానయ్య, గోపి, హనుమంతరావు అనే ఐదుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా...వారి కోసం గాలిస్తున్నారు. వర్గపోరు, భూవివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితులను గుంటూరు సీసీఎస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. నిందితులు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఇదీచదవండి

మంగళగిరిలో తెదేపా నేత దారుణ హత్య

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... గుజరాత్ రాష్ట్ర బంగాళదుంప రైతులు మరోసారి తన హక్కును దేశ ప్రజల ముందుకు పాలకుల దృష్టికి తీసుకువచ్చారని వారు తమ సమైక్య పోరాటం ద్వారా ప్రజా న్యాయవాదుల సహకారంతో పెప్సికో వంటి బహుళ జాతి దిగ్గజం పై విజయం సాధించారని బంగాళదుంప రైతుల తరపున అహ్మదాబాద్ కోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది ఆనంద్ కుమార్ యాగ్నిక్ పేర్కొన్నారు. పంట విత్తన స్వాతంత్ర్యం - రైతు హక్కు అనే అంశంపై గుంటూరు వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . పెప్సికో వంటి బహుళజాతి దిగ్గజం పై విజయం సాధించడం శుభపరిణామన్నారు. అయిన కూడా పెప్సికో వంటి వివిధ కంపెనీలు రోజు రోజుకు పుట్టుకు వస్తున్నాయన్నారు. రైతులందరూ విత్తన శుద్ధిపట్ల అవగాహన కల్గివుండలన్నారు. రైతులు అన్ని రాష్ట్రాల రైతులతో కలిసి విత్తన రక్షణకై పోరాడాలని విత్తనాల హక్కుల్ని పరిరక్షించుకోవాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ రైతు సంఘాన్ని రైతులని చైతన్య పరిచిన కవిత కురుగంటి, అఖిలభారత యువజన సంఘం నాయకులు, రైతు రక్షణ వేదిక సభ్యులు, వివిధ రైతు సంఘాల నాయకులు, ప్రజా నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Body:బైట్.....ఆనంద్ కుమార్ యగ్నిక్......బంగాళదుంప రైతుల తరపున అహమాదాబాద్ కోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది.

Conclusion:బైట్.....ఆనంద్ కుమార్ యగ్నిక్......బంగాళదుంప రైతుల తరపున అహమాదాబాద్ కోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది.
Last Updated : Jun 26, 2019, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.