రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన తండ్రి దశరాథరామిరెడ్డి పేర్లు వచ్చాయి. పెదకాకాని మండలం పెదకాకానిలో ఆళ్ల దశరథరామిరెడ్డి, ఫిరంగిపురం మండలం వేమవరంలో ఎమ్మెల్యే ఆర్కే పేరుంది. దీనిపై స్పందించిన ఆయన... గత ప్రభుత్వం చేసిన సాధికార సర్వే వల్లే తమ పేర్లు వచ్చాయని....వాటిని వెంటనే తొలగించాలని కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: గుంటూరులో పిచ్చిమొక్కలు పెరిగిన స్థల యజమానులకు నోటీసులు...