ETV Bharat / state

దేశీయ వంగడాల కోసమే మన ఊరు-మన విత్తనం - tenali mla

గుంటూరు జిల్లాలో దేశీయ వంగడాలను మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు మన ఊరు-మన విత్తనం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం చేసిన చరిత్ర గుంటూరు రైతులకు ఉందని ఆయన అన్నారు.

మళ్లీ వినియోగంలోకి రానున్న దేశీయ వంగడాలు
author img

By

Published : Jul 11, 2019, 2:08 PM IST

మళ్లీ వినియోగంలోకి రానున్న దేశీయ వంగడాలు

దేశీయ వంగడాలను మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు గుంటూరు జిల్లా కొల్లిపోర మండలంలో మన ఊరు మన విత్తనం కార్యక్రమాన్ని చేపట్టారు. హైబ్రిడ్ రకాలు రాకముందున్న వంగడాల్ని రైతులకు పరిచయం చేయటంతో పాటు వాటితో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ...దేశీయ విత్తనాలను ఉపయోగించి వ్యవసాయం చేయటం ద్వారా పెట్టుబడులు బాగా తగ్గుతాయన్నారు. అలాగే ఈ విధానంలో ఆరోగ్యకరమైన ఆహారం పండించవచ్చని... ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఈ సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారని వారు వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం చేసిన చరిత్ర గుంటూరు రైతులకు ఉందని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధకి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన 200 రకాల దేశీవాలి వరి వంగడాల్ని వారు సందర్శించారు.

ఇది చూడండి: 'రూ.10 కోట్ల ఆస్తి ఉన్న వధువు కావలెను'

Intro:FILE NANE : AP_ONG_42_08_YSR_JAYANTHI_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి వైయస్ రాజశేఖర రెడ్డి అని ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు... వైఎస్ఆర్ జయంతి సందర్భముగా చీరాల పట్టణంలో వైకాపా శ్రేణులు ద్విచక్రవాహనర్యాలీ నిర్వహించారు.. గడియారస్తంభం కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ శాశనసభ్యుడు కృష్ణమోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..

Body:చీరాలలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.