ఇంటి నిర్మాణానికి 10 టన్నుల ఇసుక బుక్ చేస్తే... అందులో 2 టన్నులకు పైగా రాళ్లే వచ్చాయని ఓ వ్యక్తి ఆవేదన చెందాడు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చాగల్లుకు చెందిన జొన్నలగడ్డ సురేష్ తన ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో 10 టన్నుల ఇసుకను 8 వేలు చెల్లించి బుక్ చేశాడు.
తీరా ఇసుక లోడు వచ్చాక చూస్తే అందులో సుమారు 2 టన్నుల వరకు రాళ్లతో కూడిన ఇసుక వచ్చింది. లారీ డ్రైవర్‌ను ఇసుక బాగోలేదని అడగ్గా తనకు సంబంధం లేదని తెలిపాడు. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు సురేష్ కోరుతున్నాడు.
ఇవీ చూడండి: