కుల బహిష్కరణ చేశారని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో జరిగింది. కులాంతర వివాహం చేసుకోవడంతో వెలేసారని ఆవేదనతో బలవన్మరణానికి యత్నించాడు. విడాకులిచ్చిన తర్వాత కూడా కులంలోకి రానివ్వడంలేదని ఆవేదనతో ఎలుకల మందు తాగి సాయికుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: POLAVARAM DAM : పోలవరం ప్రాజెక్టు...నిర్మాణం పూర్తయ్యేదెన్నడు...?